హైదరాబాద్ వాసులకు శుభవార్త..జూన్ 1నుంచి మెట్రో సర్వీసులు...!

హైదరాబాద్ వాసులకు శుభవార్త..జూన్ 1నుంచి మెట్రో సర్వీసులు...!

కరోనా లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో నిలిచిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. జూన్ 1తర్వాత నుంచి మెట్రో సర్వీసులు మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా మారింది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో సిటీ బస్సులు, మెట్రో సర్వీసులను మాత్రం నిలిపేసింది. దీనితో ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం కేసిఆర్ హైదరాబాద్‌లోని 32 మార్గాలకు సిటీ బస్సు సర్వీసుల సదుపాయాన్ని కల్పిస్తూ అనుమతులు ఇచ్చారు.