నాలుగు బ్యాంకుల విలీనం?

నాలుగు బ్యాంకుల విలీనం?

ఎస్‌బీఐలోకి తన అనుబంధ బ్యాంకులను కలిపి.. మెగా బ్యాంకును రూపొందించినట్లే... నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే యోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మార్కెట్‌ వర్గాల కథనం మేరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌లను విలీనం చేయాలి ప్రభుత్వం భావిస్తోంది. పలు పీఎస్‌యూ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 4 లేదా 5 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గత ఏడాది ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులను మాతృ బ్యాంకులో ఎన్డీఏ విలీనం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపాదిత నాలుగు బ్యాంకులను విలీనం చేస్తే ఎస్‌బీఐ తరవాత అతి పెద్ద బ్యాంక్‌ అవతరిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.