ఇద్ద‌రు క‌లిసి రూ.500 కోట్ల స్కామ్‌.. భార్య చేతిలో భ‌ర్త హ‌తం.. ట్విస్ట్ ఇదే..!

ఇద్ద‌రు క‌లిసి రూ.500 కోట్ల స్కామ్‌.. భార్య చేతిలో భ‌ర్త హ‌తం..  ట్విస్ట్ ఇదే..!

దంప‌తులు ఇద్ద‌రు మంచి కేడీలు.. ఇద్ద‌రు క‌లిసి కోట్ల‌లో టోక‌రా పెట్టారు.. కేసుల‌పాలుకావ‌డంతో.. ఇద్ద‌రూ జైలులో చిప్ప‌కూడుతిన్నారు.. అయితే, జైలు నుంచి విడుద‌లైన భ‌ర్త.. త‌మిళ‌నాడు నుంచి హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చాడు.. అంతేకాదు.. మ‌రో మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం సాగిస్తున్నాడు.. ఐదేళ్ల త‌ర్వాత భ‌ర్త ఆచూకీ తెలుసుకొని హైద‌రాబాద్ వ‌చ్చిన భార్య‌.. త‌న భ‌ర్త చేస్తున్న ప‌ని న‌చ్చలేదు.. దీంతో..  త‌న భ‌ర్త‌నే హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసి చివ‌ర‌కు పోలీసుల‌కు దొరికిపోయింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ఎంఎల్ఎం స్కామ్ సంచ‌ల‌నం సృష్టించింది.. ఈ స్కామ్ విలువ రూ.500 కోట్ల‌కు పైగానే.. దీనికి స్కెచ్ వేసింది మాత్రం ప్రభాకరన్ , సుక‌న్య దంపతులు... ఈ కేసుల్లో ఇద్ద‌రూ అరెస్ట్ కాగా.. జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత తమిళనాడు నుంచి పారిపోయి హైదరాబాద్‌కు మ‌కాం మార్చాడు ప్ర‌భాక‌ర‌న్‌.. ఐదేళ్లుగా హైద‌రాబాద్‌లోనే త‌ల‌దాచుకుంటున్నాడు.. ఇదే స‌మ‌యంలో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.. భర్త ఆచూకీ తెలుసుకుని తాజాగా, హైద‌రాబాద్ వ‌చ్చిన భార్య సుక‌న్య‌.. మరో మహిళతో త‌న భ‌ర్త సహజీవనం చేయ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయింది.. ప్రభాకరన్‌ని చంపేసి.. ఆత్మహత్య గా చిత్రీక‌రించింది.. అనుమానం వచ్చిన మ‌ల్కాజ్‌గిరి పోలీసులు సుక‌న్య‌ను విచారించారు.. దీంతో.. త‌న భ‌ర్త ప్ర‌భాక‌ర‌న్‌ను తానే చంపేసిన‌ట్టు  అంగీక‌రించింది.. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు త‌ర‌లించారు. క‌లిసి స్కెచ్ వేసి.. కోట్లు నొక్కేశారు.. జైలు పాల‌య్యారు.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో భ‌ర్త‌ను హ‌త్య చేసి.. మ‌ళ్లీ జైలులో ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.