'మెహబూబా'పై ప్రేక్షకుల మాట...

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'మెహబూబా'... ఈ మూవీలో ఆకాష్ పక్కన హీరోయిన్‌గా నేహా శెట్టి నటించగా... మురళీశర్మ, షాయాజీ షిండే, విష్ణు రెడ్డి తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించారు. సందీప్ చౌతా సంగీతం సమకూర్చగా... పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. పునర్జన్మల నేపథ్యంలో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు వచ్చినా... పూరి జగన్నాథ్ ఇటువంటి కథతో సినిమా తీయడం తొలిసారి. ఈ సినిమాలోనే డైలాగ్స్‌తో పూరిలోని రచయితలో ఫైర్ తగ్గలేదనే చెప్పుకుంటున్నారు. సినిమా రివ్యూలు ఎలా ఉన్నా... మరి ప్రేక్షకుల మాటేంటి? ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చిందా? పూరీ మార్క్ చూపించాడా? ఆకాష్ హీరోయిజాన్ని పడ్డించాడా...? నేహా శెట్టి ఆకట్టుకుందా? అసలు ప్రేక్షకులు ఈ మూవీపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...