రౌడీ అల్లుడుకి 28ఏళ్ళు వచ్చాయి 

రౌడీ అల్లుడుకి 28ఏళ్ళు వచ్చాయి 

మెగాస్టార్ చిరంజీవి... రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.  దాదాపుగా అన్ని మెగా హిట్ అందుకున్న సినిమాలే కావడం విశేషం. అలా బెస్ట్ హిట్స్ అందుకున్న సినిమాల్లో రౌడీ అల్లుడు ఒకటి.  ఈ సినిమా అక్టోబర్ 18, 1991న రిలీజ్ అయ్యింది.  అంటే ఈరోజుకు సరిగ్గా 28 సంవత్సరాలు. అప్పట్లో ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  శోభన, దివ్యభారతి ఇద్దరు హీరోయిన్లు తమదైన శైలిలో నటించి మెప్పించారు.  

ఇందులో మెగాస్టార్ డబుల్ యాక్షన్ తో వావ్ అనిపించే విధంగా నటించే మెప్పించిన సంగతి తెలిసిందే.  ముంబైలో ఆటో జానీగా మెగాస్టార్ అదరగొట్టాడు.  ఇక వ్యాపారవేత్త, క్లాస్ పాత్రలో కూడా మెగాస్టార్ సూపర్ అనిపించే నటించాడు. రావుగోపాలరావు, కైకాల, కోట, అల్లు రామలింగయ్య ఎవరికి వారు విలనిజం పండిస్తూనే కావాల్సినంత కామెడీని నడిపించారు.  బప్పీలహరి అందించిన మ్యూజిక్ సినిమాలు ప్రాణం పోసింది.  బోలో బోలో రాణి అంటూ నాటు స్టెప్పులతో అదరగొట్టిన మెగాస్టార్.. చిలుకా క్షేమమా అంటూ క్లాసికల్ గా మెప్పించాడు.  క్లాస్ మాస్ అందరిని ఆకట్టుకున్న ఈ రౌడీ అల్లుడు రిలీజైన ప్రతి థియేటర్లో వందరోజులు ప్రదర్శించబడింది.