పవన్ అడిగితె... చిరు ఇచ్చేస్తాడట... 

పవన్ అడిగితె... చిరు ఇచ్చేస్తాడట... 

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన తరువాత దూసుకుపోతున్నారు.  ఖైదీ నెంబర్ 150, సైరా సినిమా తరువాత మెగాస్టార్ కొరటాల కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.  అయితే, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.  కరోనా ఇష్యూ క్లియర్ అయ్యాక తిరిగి షూటింగ్ మొదలుపెడతారు.  అది ఎప్పుడు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  

అయితే, ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మలయాళం సినిమా లూసిఫర్ సినిమా చేస్తారని అంటున్నారు.  రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించిన హక్కులను కొనుగోలు చేశారు.  మోహన్ లాల్- పృథ్విరాజ్ నటించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో మెగాస్టార్.. రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా చేస్తారని టాక్ వస్తోంది.  అయితే, మెగాస్టార్ చిరంజీవి కొన్ని విషయాలు చెప్పారు.  ఒకవేళ తమ్ముడు పవన్ ఈ సినిమా చేస్తాను అంటే దీనిని పవన్ కు ఇచ్చేస్తానని అన్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.  పవన్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు.  వకీల్ సాబ్, క్రిష్ సినిమా, హరీష్ శంకర్ సినిమాలు లైన్లో ఉన్నాయి.