రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై మెగా హీరోల అద్భుతమైన ట్విట్...చిరంజీవి, పవన్‌ ఏం ట్విట్ చేశారంటే...!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై మెగా హీరోల  అద్భుతమైన ట్విట్...చిరంజీవి, పవన్‌ ఏం ట్విట్ చేశారంటే...!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసి జన హృదయ నేత సీఎం కేసీఆర్ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారు...ఈ రోజు చారిత్రాత్మకమైనది....కోట్లాది మంది కల సాకారమైన రోజు..దశాబ్దాల కోరికా నెరవేరిన రోజు..ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ  జన్మించిన రోజు అని ట్విట్ చేశారు..వేలాది మంది బలిదానాలు..కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ..అభివృద్ది ఫలాలు అందరికి అందించవల్సిన బాధ్యత ప్రభుత్వాలను నడిపే నేతలు,ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాలపై ఉందని పేర్కొన్నారు..
తెలంగాణ రాష్ట్రం దినదిన ప్రవర్థమానం అవ్వాలని,అభివృద్ధిలో తిరుగులేని శక్తిగా నిలవాలని  కోరుకుంటున్నాను అని పవన్‌ ప్రకటన విడుదల చేశారు...తెలంగాణ కోసం ప్రాణాలు ఆర్సించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నానని పవన్‌ పేర్కొన్నారు...