'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ పై మెగాస్టార్...

'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ పై మెగాస్టార్...

సోషల్ మీడియాకు దూరంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీ మోషన్ పోస్టర్ పై ప్రసంశలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభినందనలు తెలియజేసారు. రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో తారక్ కొమరం భీం గా నటిస్తుండగా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. కొద్ది సేపటి క్రితం ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి  ఈ పోస్టర్ పై స్పందిస్తూ .. ఇప్పుడే ఆర్ఆర్ఆర్ చిత్ర మోషన్ పోస్టర్ చూశాను. కనుల విందుగాను, రోమాలు నిక్కపొడుచుకునేలా టీజర్ ఉంది. రాజమౌళి, ఎన్టీఆర్, రాజమౌళి వర్క్ చాలా బాగుంది. కీరవాణి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ పోస్టర్ ఈ ఉగాదికి మరింత వినోదాన్ని అందించిందని చిరంజీవి కొనియాడారు.