మొదటి సినిమా విడుదలకు ముందే రెండో సినిమా సైన్ చేసిన మెగా హీరో...

మొదటి సినిమా విడుదలకు ముందే రెండో సినిమా సైన్ చేసిన మెగా హీరో...

ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే ఎక్కువ. అయితే మిగిత కుటుంబాల నుండి కూడా హీరోలు వస్తున్నారు కానీ నిలబడలేకపోతున్నారు. కానీ మెగా కుటుంబం నుండి ఒకొక్క హీరో వస్తూ తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే బాటలో ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు హిట్ కావడంతో సినిమా పై అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. కానీ ఈ సినిమా విడుదల సమయానికి కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. అయితే తన మొదటి సినిమా విడుదల కాకముందే  రెండో సినిమా సైన్ చేసాడట ఈ మెగా హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాలని చూస్తుందట! ఈ సినిమాతో కొత్త  డైరెక్టర్ ను పరిచయం చేయాలనీ అనుకుంటున్నారట  నిర్మాతలు.. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.