ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్ఠం చేయాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్ఠం చేయాలి

దేశంలో దళితులపై దాడులు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పటిష్ఠపరచాలని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలను బానిసల్లాగా చూస్తున్నారని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాటతప్పారని చెప్పారు. డిప్యూటీ సీఎం రాజయ్యని ఎందుకు బర్తరఫ్ చేశారో చెప్పలేదన్నారు.  

అసెంబ్లీ లో దళిత ఎమ్మెల్యే సంపత్ సభ్యత్వం కారణం లేకుండానే రద్దు చేశారని విమర్శించారు.  రాజ్యాంగాన్ని ఖునీ చేస్తూ... కేసీఆర్ ఇష్టానుసారంగా నడుచుకోడం బాధాకరమన్నారు మీరా కుమార్. తెలంగాణలో జరుగుతున్న వరుస ఘటనలు, కేసీఆర్ ప్రభుత్వ విధానాలు చాలా బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.