ఎన్‌ఎస్‌ఈలో ఎంసీఎక్స్‌ విలీనం

ఎన్‌ఎస్‌ఈలో ఎంసీఎక్స్‌ విలీనం

షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ఎక్స్ఛేంజ్‌ అయిన ఎన్‌ఎస్‌ఈ, కమాడిటీ మార్కెట్‌ ఎక్స్ఛేంజ్‌ ఎంసీఎక్స్‌లు విలీనం కావాలని నిర్ణయించాయి. ఎన్‌ఎస్‌ఈలో షేర్‌ మార్కెట్‌తో పాటు కరెన్సీ మార్కెట్‌ ట్రేడింగ్‌కు వీలుంది.  ఎంసీఎస్‌  అనేక రకాల ఆగ్రి, మెటల్స్‌ ట్రేడింగ్‌ జరుగుతోంది. ఈ రెండు ఎక్స్ఛేంజీల విలీనంతో ఇన్వెస్టర్లకు చాలా ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఇన్వెస్టర్లు షేర్‌, కమాడిటీల ట్రేడింగ్‌ కోసం రెండు విడిగా ఖాతాలు ఉండాల్సిందే. అలాగే షేర్‌ మార్కెట్‌ అకౌంట్‌లోని నిధులను వెంటనే కమాడిటీస్‌  అకౌంట్‌లో మార్చేందుకు వీలు లేదు. దీంతో ఈ రెండింటి విలీనంతో  ఇన్వెస్టర్లకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. విలీనానికి సంబంధించిన ప్రతిపాదనను సెబీకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.