దీపికా అపార్ట్‌మెంట్‌లో మంటలు

దీపికా అపార్ట్‌మెంట్‌లో మంటలు

ముంబైలోని ఓర్లి ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇదే భవనంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొన్ నివసిస్తోంది. మధ్యాహ్నం భవనం చివరి అంతస్తు 33వ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకొని మంటల నార్పుతున్నారు. పై రెండతస్థులు తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.