ధూమ్ ధామ్ గా పెళ్లి ఒకరికి కరోనా..మూడు గ్రామల ప్రజలు క్వారంటైన్...!

ధూమ్ ధామ్ గా పెళ్లి ఒకరికి కరోనా..మూడు గ్రామల ప్రజలు క్వారంటైన్...!

 

పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలు వద్దని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ప్రజల చెవికెక్కడం లేదు. కరోనా జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలోనూ ఇలాగే జరిగింది. రామచంద్రాపురంలో ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ వేడుకకు హాజరయిన మూడు గ్రామాల ప్రజలను క్వారెంటెయిన్‌కు తరలించారు అధికారులు. ఆ వ్యక్తి కాంటాక్ట్‌ అయిన మిగిలిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

నాగర్ కర్నూల్‌లోని రామచంద్రాపురంలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. అతడి తోడల్లుడి కుమార్తె వివాహా వేడుకకు మూడు గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఈ నెల 13న రామంతపూర్‌లో పతానం వేడుక.. 14న కడ్తాల్ మండలంలో పెళ్లి చేశారు. పెళ్లికి రామచంద్ర పురం, రామంతపూర్, వంపు గ్రామాల నుంచి బంధువులు హాజరయ్యారు. ఈ నెల 18న బాధితుడు తన గ్రామలో దావత్ ఇచ్చాడు. ఈ దావత్‌కు వందమంది బంధువులు వచ్చారు. బాధితుడికి కరోనా వైరస్ సోకిందని తేలడంతో... రామచంద్రపురం, రామంతపూర్, వంపుగూడ గ్రామాలను క్వారంటైన్ చేశారు. బాధితుడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్‌ను గుర్తించడం ఇప్పుడు అధికారులకు తలకు మించిన భారంగా మారింది.