నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

మార్కెట్‌ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు రాత్రి స్వల్ప నష్టాలతో ముగిసింది. రాత్రి స్వల్పంగా తగ్గినా.. ముడి  చమురు ధరలు ఇవాళ మళ్ళీ పెరిగాయి. బ్రెంట్‌ 79.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఉత్సాహంగా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ అరశాతం లాభంతో ట్రేడవుతుండగా, చైనా మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 42 పాయింట్ల నష్టంతో 10,639 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి షేర్లలో బజాజ్‌ ఆటో రెండు శాతం పెరిగింది. బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నా.. ఒక శాతం లాభాలకే పరిమితమయ్యాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో బీపీసీఎల్‌ ముందుంది. ఈ షేర్‌ తో పాటు విప్రో, గెయిల్‌ షేర్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఇలో ఆర్‌ కామ్ ఇవాళ కూడా 14 శాతం పెరిగింది. రిలయన్స్‌ నావల్‌ కూడా ఏడు శాతం లాభపడింది.