లాభాలతో మొదలైన మార్కెట్లు

లాభాలతో మొదలైన మార్కెట్లు

ఇటలీ సంక్షోభాన్ని మార్కెట్లు డిస్కౌంట్‌ చేసేయడంతో షేర్‌ మార్కెట్‌ మళ్ళీ పుంజుకుంది.రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అలాగే ఆసియ కూడా మంచి ఊపుమీద ఉంది. చైనాసూచీలు ఏకంగా రెండు శాతం వరకు పెరిగాయి. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లలో కూడా సూచీలు లాభాలతో మొదలయ్యాయి. నిఫ్టి 35 పాయింట్ల లాభంతో 10649 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మెటల్‌ షేర్ల సూచీ మినహా మిగిలిన సూచీలు నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, యూపీఎల్‌ షేర్లు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్‌ రెండు శాతం, బీపీసీఎల్‌ ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. హీరో మోటో కార్ప్‌, అదానీ పోర్ట్స్, ఐఓసీ షేర్లు కూడా ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఇలో అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిన్న భారీ లాభాలతో ముగిసిన ఆర్‌ కామ్‌ ఇవాళ కూడా 14 శాతం లాభంతో ట్రేడవుతోంది. రిలయన్స్‌ నావల్‌ 8 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.  ఇక నష్టాలతో ట్రేడవుతున్న షేర్లలో క్రిసిల్‌, హిందుస్థాన్‌ కాపర్‌, సీజీ వపర్‌ ఉన్నాయి.