నష్టాలతో మొదలైన మార్కట్‌

నష్టాలతో మొదలైన మార్కట్‌

ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి  అమెరికా వైదొలగడంతో అంతర్జాతీయ మార్కట్లు డైలమాలో పడ్డాయి. ఇరాన్‌పై ఆంక్షలు కూడా విధిస్తామని ట్రంప్‌ ప్రకటించడంతో సెంటిమెంట్‌ డల్‌గా మారింది. ఆంక్షలపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. పెద్ద లాభనష్టాల్లేవు. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ నష్టాల్లో ఉండగా, చైనా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ కూడా గ్రీన్‌లో ఉంది. ఈ అనిశ్చితిలో మన మార్కెట్లు 10,700 దిగువన స్వల్ప నష్టంతో ప్రారంభమైనా.. వెంటనే 10700పైకి చేరుకుంది. చమురు ధరలు అనూహ్యంగా పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్‌పీసీఎల్‌ అయిదు శాతం క్షీణించగా, బీపీసీఎల్‌, ఐఓసీ మూడు శాతం మేర నష్టంతో ట్రేడవుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా నష్టంతో ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఒకశాతం తగ్గింది. ఇక లాభాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో హిందాల్లో ముందుంది. ఈషేర్‌ మూడు శాతం లాభపడింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌ షేర్లు ఒకశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఈలో సింటెక్స్‌ షేర్‌12 శాతం లాభపడింది.