నిలకడగా స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

నిలకడగా స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు రాత్రి ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతం వరకు నష్టపోగా..చైనా మార్కెట్లదీ అదే దారి. హాంగ్ సెంగ్‌ కూడా ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అప్రతిహతంగా పెరుతూ వచ్చిన ముడి చమురు ధరలు ఇపుడు కాస్త చల్లబడ్డాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 16 పాయింట్ల నష్టంతో 10,520 వద్ద ట్రేడవుతోంది. ఇపుడు నిఫ్టికి 10500 చాలా కీలక స్థాయిగా మారింది. నిఫ్టి షేర్లలో సిప్లా 5 శాతం పైగా లాభపడింది. నిన్న నాలుగు శాతంపైగా లాభంతో ముగిసిన ఎస్‌బీఐ ఇవాళ మరో మూడు శాతం లాభంతో ఓపెనైంది. ప్రస్తుతం 262 వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముందున్నాయి. ఇక నష్టాలతో ట్రేడవుతున్న నిఫ్టి షేర్లలో వేదాంత టాప్‌లో ఉంది. ఈ షేర్‌ 3 శాతం పడింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఒకటిన్నర నుంచి రెండు శాతం మధ్య నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఈలో స్ట్రయిడ్స్‌ షాసన్‌ మరో 7 శాతం లాభపడింది. హిందుస్థాన్‌ కాపర్‌ 6 శాతం లాభంతో ట్రేడవుతోంది.