లాభాలతో మొదలైన నిఫ్టి

లాభాలతో మొదలైన నిఫ్టి

మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. ట్రంప్‌, కిమ్‌ భేటీ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్పుల్లేవ్‌. ఉదయం నుంచి ఆసియా మార్కట్లు కూడా లాభాల్లో ఉన్నా... అవి నామమాత్రంగానే ఉన్నాయి. షాంఘై సూచీ ఒక్కటే ఒకశాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి 10,800పైన ప్రారంభమైంది. అక్కడే కదలాడుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐఓసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హెచ్‌పీసీఎల్‌, సిప్లా, బీపీసీఎల్‌ షేర్లు ఒకశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో టాటా స్టీల్‌ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌ నష్టాల్లో ఉన్నా... అర శాతం లోపే ఉన్నాయి.