నిలకడగా ప్రారంభమైన మార్కెట్లు

నిలకడగా ప్రారంభమైన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. శుక్రవారం యూరో మార్కెట్లు భారీగా నష్టపోయినా.. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. పెద్ద మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌తో పాటు చైనా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రస్తుతం 10,801 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 34 పాయింట్లు పెరిగింది. ఫార్మా, ఐటీ షేర్లలో కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. రియలన్స్‌ ఇండస్ట్రీస్ నిఫ్టి గెయినర్స్‌లో టాప్‌లో ఉంది. ఈ షేర్‌ ఇపుడు రూ. 996 వద్ద ట్రేడవుతోంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా ఒకశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి. ఈ రెండు షేర్లు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.