మార్క్‌ రుటే 'సపరేటు'

మార్క్‌ రుటే 'సపరేటు'

దేశానికి ప్రధానమంత్రి అయినా హంగు ఆర్బాటాలకు దూరం.  చేసిన చిన్నపాటి పొరపాటును ఆయనే సరిదిద్దుకున్నారు. నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుటే ఇటీవల పార్లమెంట్‌కు వస్తుండగా ఆయన చేతిలోని కాఫీ కప్పు డోర్‌కు తగిలి పొరబాటుగా కిందపడిపోయింది. పనివాళ్లని పిలిపించి శుభ్రం చేయమంటే సరిపోతుంది. కానీ ఆయన అలా చేయలేదు. చేజారిన కాఫీని ఆయనే స్వయంగా శుభ్రం చేశారు. మాప్‌ తీసుకుని కాఫీ మరకలను తుడిచేశారు.  రుటే చేసిన ఈ పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  పక్కనే ఉన్న అధికారులు వెంటనే పనివాళ్లను పిలిచారు. అయితే మార్క్‌ వారిని వద్దని చెప్పి ఆయనే స్వయంగా శుభ్రం చేశారు.  ఈ చర్యతో అక్కడున్న వారు  ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత మార్క్‌ నిరాడంబర వ్యక్తిత్వాన్ని చప్పట్లతో ప్రశంసించారు. ఈ వీడియోను డచ్‌ దౌత్యవేత్త ఒకరు ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.   

https://www.youtube.com/watch?time_continue=2&v=RVq3qMln-ok