మళ్లీ రెచ్చిపోయిన మావోలు

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు ఈ మధ్యకాలంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు కావాలనే ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపిస్తూ.. దేశవ్యాప్త బంద్ కు కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా కోడెపాల్‌ వద్ద మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. అక్కడి బ్రిడ్జి పనులకు ఉపయోగిస్తున్న నాలుగు సిమెంట్‌ మిక్సింగ్‌ వాహనాలను నిన్న తగలబెట్టారు. అంతటితో ఆగకుండా సైట్‌ గుమస్తాను హతమార్చారు. అనంతరం కొన్ని కరపత్రాలు వదిలి వెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.