భార్య అక్రమ సంబంధం కూతురిని మింగేస్తే, తండ్రి ట్రైన్ కింద తల పెట్టి !

భార్య అక్రమ సంబంధం కూతురిని మింగేస్తే, తండ్రి ట్రైన్ కింద తల పెట్టి !

మేడ్చల్ లో పది రోజుల క్రితం దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ తల్లి వేసిన తప్పటడుగులకు ఐదేళ్ల చిన్నారి బలైంది. అనూష, కళ్యాణ్ అనే భార్యాభర్తలు కొద్దిరోజులుగా మేడ్చల్ జిల్లా పోచారంలో నివాసం ఉంటున్నారు. కాగా కొన్నాళ్ళ క్రితం అనూషకు సికింద్రాబాద్ లోని భవాని నగర్ కు చెందిన కరుణాకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. సదరు యువకుడి మిత్రుడు రాజశేఖర్ తో కూడా అనూష స్నేహం చేయటం ప్రారంభించి అతనితో కూడా వివాహేతర సంబంధం మొదలు పెట్టడంతో అది కరుణాకర్ కు నచ్చలేదు.

కరుణాకర్ కు వేరే అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని తెలిసిన అనూష అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. ఈ క్రమంలోనే రాజశేఖర్ అనూష ఇంటిలో ఉన్న టైంలో కరుణాకర్ సైతం వచ్చాడు. దాంతో అనూష రాజశేఖర్ ను వేరే గదిలో దాచింది. అది చూసిన కరుణాకర్ కోపోద్రేకుడయ్యాడు. రాజశేఖర్ బయటికి రావాలని గొడవ చేసాడు. అతడు బయటకు రాకపోవటంతో అక్కడే ఉన్న అనూష కూతురు ఆద్య గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. అయినప్పటికీ రాకపోయేసరికి అన్యం పుణ్యం ఎరగని పాప గొంతు కోశాడు. అనంతరం  అడ్డుకోడానికి ప్రయత్నించిన రాజశేఖర్ పై కూడా దాడి చేసాడు.

అనూష గట్టిగా కేకలు వేయటంతో అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. అక్కడకు చేరుకున్న కాలనీ వాసులు పాపను, కరుణాకర్ ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పాప మృతి చెందింది. ఈ ఘటన పై పోలీసులు అనూషను విచారించగా యువకులతో పరిచయం ఉన్నట్టు తన భర్తకు తెలియదని చెప్పింది. అయితే ఈ ఘటన జరిగాక కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కళ్యాణ్ కూడా తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో రైల్వే ట్రాక్ పై తల పెట్టి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు మరణము, భార్య చేసిన పనికి తీవ్ర మనోవేదనకు గురైన కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.