కొత్తిమీరతో చీర్ డ్యాన్స్...సోషల్ మీడియాలో వైరల్ 

కొత్తిమీరతో చీర్ డ్యాన్స్...సోషల్ మీడియాలో వైరల్ 

లాక్ డౌన్ ప్రజల కష్టాలు మాములుగా లేవు.   కరోనాకు భయపడి ప్రజలు దాదాపుగా బయటకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా  అవసరమైన పని చూసుకొని వెళ్లిపోతున్నారు.  గతంలో మాదిరిగా నాలుగు చోట్లకు తిరిగి కావాల్సినవి కొనుగోలు చేయడం లేదు.   పెద్ద పెద్ద వ్యాపార సంస్థలే మూతపడ్డాయి.  ఇక చిన్న చిన్న వ్యాపారుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  

నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసమే ప్రజలు బయటకు వస్తున్నారు.  కూరగాయల ధరలు కొన్ని చోట్ల కొండెక్కాయి. మహారాష్ట్రలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడే కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి.  ముంబై నగరంలో కరోనా కేసులు 70వేలకు పైగా ఉన్న సంగతి తెలిసిందే.  అక్కడ ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలన్నా భయపడుతున్నారు.   దీంతో ఓ కొత్తిమీర వ్యాపారి తన దగ్గర ఉన్న కొత్తిమీరను అమ్మెందుకు చీర్ డ్యాన్సర్ అవతారం ఎత్తాడు.  కొత్తిమీర కట్టను పట్టుకొని డ్యాన్స్ చేస్తూ అమ్మడం మొదలుపెట్టాడు.  ఐపీఎల్ మ్యాచ్ ల్లో చీర్ డ్యాన్స్ ను చూస్తుంటాం.  ఐపీఎల్ వాయిదా పడటంతో...రోడ్డుపై కొత్తిమీర వ్యాపారి చేసిన డ్యాన్స్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్షణాల్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.