వైరల్: యూట్యూబ్ లో ఏమి చేయకుండానే అతను రూ.70వేలు సంపాదించాడు... ఎలాగంటే... 

వైరల్: యూట్యూబ్ లో ఏమి చేయకుండానే అతను రూ.70వేలు సంపాదించాడు... ఎలాగంటే... 

డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.  అందులో ఒకటి యూట్యూబ్ లో వీడియోలు చేయడం.  వినూత్నంగా ఆలోచించి వీడియోలు చేస్తే యూట్యూబ్ కు మించిన సంపాదన ఉండదు.  అలాంటి ఆలోచనలు రావాలి కదా.  వెరైటీ వీడియోలు చేసేందుకు చాలామంది అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు.  కానీ, ఓ వ్యక్తి మాత్రం మరీ వినూత్నంగా ఆలోచించాడు. 

అలా ఆలోచిస్తూ... ఏమి చేయకుండా కెమెరాను చూస్తూ రెండు గంటల పాటు కూర్చుండిపోయాడు.  రెండు గంటలపాటు అలా కెమెరావైపు చూస్తున్న వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు.  విచిత్రం ఏమిటంటే రెండు గంటలకు పైగా ఉన్న ఆ వీడియోను 19 లక్షల మందికి పైగా చూశారు.  ఈ వీడియో ద్వారా ఆ యువకుడు రూ. 70 వేలకు పైగా సంపాదించాడు.  ఏమి చేయకుండా, కదలకుండా కూర్చొని రూ.70 వేలు సంపాదించడం అంటే మాములు విషయం కాదు కదా.  ఇక ఈ వీడియోకు రెండు గంటల పాటు కదల్లేదు అనే పేరు పెట్టాడు.  ఈ వీడియోకు కామెంట్స్ కు ఫన్నీగా రావడం విశేషం.  రెండు గంటల్లో అతను 362సార్లు కంటి రెప్పలు ఆర్పాడు అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.  ఏమి చేయకుండానే తన వీడియో ట్రెండ్ అయ్యిందని అంటున్నాడు దిదిత్.