వ‌దిన‌తో ఎఫైర్... అడ్డుగాఉన్నాడ‌ని అన్న హ‌త్య‌..!

వ‌దిన‌తో ఎఫైర్... అడ్డుగాఉన్నాడ‌ని అన్న హ‌త్య‌..!

వ‌దిన అంటే అమ్మ త‌ర్వాత అమ్మ‌గా.. వ‌దిన‌మ్మ‌గా పిలుస్తుంటారు.. ఇక‌, మ‌రిదికి కూడా ప్ర‌త్యేక స్థానం ఉంటుంది.. వ‌దిన‌కు త‌మ్ముడిలా ప్ర‌తీ విష‌యంలోనూ స‌పోర్ట్‌గా ఉంటారు.. కానీ, వారి ఇద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఏర్ప‌డింది.. వారిపై అనుమానం వ‌చ్చి మంద‌లించిన అన్న‌పైనే క‌క్ష‌గ‌ట్టాడు.. త‌మ బంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని భావించి సొంత అన్న‌నే దారుణంగా హ‌త్య చేసి.. పాతిపెట్టిన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని గరీబ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల  నాగరాజు అనే యువ‌కుడు.. ఈశ్వరమ్మ అనే యువతిని గ‌త ఏడాది వివాహం చేసుకున్నాడు.. వృత్తి రీత్యా వెంట్రుకల సేకరణ, గ్రామాలు తిరుగుతూ బూందీ విక్ర‌యిస్తూ ఉంటాడు నాగ‌రాజు.. హాయిగా సాగుతోన్న వీరి సంసారంలో చిచ్చు పెట్టాడు.. నాగ‌రాజు త‌మ్ముడు మహేష్... మాయమాటలతో వదినను లొబ‌ర్చుకున్న మ‌హేష్.. అన్న ఇంట్లో లేని స‌మ‌యంలో.. వ‌దిన‌తో అక్ర‌మ సంబంధాన్ని కొన‌సాగించాడు.. వీరి వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కు వెళ్లిందంటే.. భ‌ర్త ఎదురుగానే మ‌ర‌దితో ఫోన్‌లో స‌ర‌సాల వ‌ర‌కు వెళ్లింది.. ఆగ్ర‌హించిన భ‌ర్త‌.. పద్ధతి మార్చుకోవాలంటూ త‌న భార్య‌ను ప‌లు మార్లు హెచ్చ‌రించాడు.. అయినా ప‌ద్ధ‌తి మార‌లేదు.. ఈ విష‌యంలో దంపతుల మధ్య త‌ర‌చూ గొడ‌వ‌లకు దారితీసింది.. ఇదే క్ర‌మంలో నాగ‌రాజు క‌నిపించ‌కుండా పోయాడు.. ఇక‌, ఈ నెల 24వ తేదీ నుంచి తన కొడుకు కనిపించడం లేదంటూ నాగరాజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు స‌మోదు చేయ‌గా.. శనివారం తెల్లవారుజామున నాగరాజు ఇంటి సమీపంలోని పొద‌ల్లో.. ఓ మృతదేహాన్ని కుక్క‌లు బ‌య‌ట‌కు లాక్కొచ్చాయి... ఈ విష‌యం పీఎస్ వ‌ర‌కు వెళ్ల‌డంతో.. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించారు. చొక్కా, లుంగీ ఆధారంగా ఆ మృతదేహం నాగ‌రాజుదేన‌ని త‌ల్లి గుర్తించింది.. వ‌దిన ఈశ్వ‌ర‌మ్మ‌, మ‌రిది మ‌హేష్‌.. అక్రమ సంబంధం బ‌య‌ట‌ప‌డ‌డంతోనే వారే నాగ‌రాజును హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ ప‌రారీలో ఉన్నార‌ని తెలుస్తోంది.