ఆడవారికి వీడియో కాల్ చేసి వెకిలి వేషాలు...అరెస్ట్ !

ఆడవారికి వీడియో కాల్ చేసి వెకిలి వేషాలు...అరెస్ట్ !

వాట్సాప్, ఫేస్ బుక్, మెసెంజర్ లలో మహిళా న్యాయవాదులు, డాక్టర్లు, యువతులు, మహిళ ఉద్యోగినులే టార్గెట్ గా వీడియో కాల్స్ చేసి విసిగిస్తున్న వ్యక్తిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు చిత్తూరుకి చెందిన మోట దుర్గ ప్రసాద్ గా గుర్తించారు. వాయిస్ కాల్స్ లో అసభ్యంగా మాట్లాడటం, వీడియో కాల్ లో ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నిందితుడు పైశాచికానందం పొందినట్టు పోలీసులు గుర్తించారు. వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్టు చెబుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.