కేసీఆర్‌కు కోర్టులంటే లెక్కలేదా..?

కేసీఆర్‌కు కోర్టులంటే లెక్కలేదా..?

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. తమ శాసనసభ్యులు సంపత్, కోమటిరెడ్డిల సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని.. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ విలువలను కాలరాస్తూ వ్యవహరిస్తోందన్నారు.. శాసనసభ్యుల సస్పెన్షన్‌పై రాజ్యాంగాన్ని రక్షించే అన్ని సంస్థలను కాంగ్రెస్ సంప్రదించిందని మల్లు అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ శాసనసభ వెబ్‌సైట్‌లో వారి డేటాను అప్‌డేట్ చేయకపోవడం దారుణమని.. దీనిని ఆధారంగా తీసుకుని తాము ఇవాళ అసెంబ్లీ సెక్రటరీకి మెమొరాండం ఇచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.