ఆ హీరోయిన్ కోరికను తీర్చిన ధనుష్... 

ఆ హీరోయిన్ కోరికను తీర్చిన ధనుష్... 

గత నెల 28న హీరో ధనుష్ పుట్టినరోజు సందర్బంగా చాల మంది సెలబ్రెటీలు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ అందులో హీరోయిన్ మాళవిక మోహనన్ చెప్పిన విషెస్ మాత్రం బాగా వైరల్ అయ్యింది. అందుకు కారణం ఈ భామ ధనుష్ కు పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ .. అతనితో కలిసి నటించాలనే కోరికను బహిరంగంగా ప్రకటించింది. మాళవిక కు సమాధానం ఇస్తూ నీ కోరిక త్వరలోనే తీరుతుంది అని ధనుష్ చెప్పాడు. ఇక తాజాగా ధనుష్‌ హీరోగా కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ‘డీ43’ అనే సినిమా వీస్తున్న విషయం తెలిసందే. అయితే  ఈ సినిమాలో  హీరోయిన్‌గా మాళవికా మోహనన్‌ని తీసుకుంటామని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని ఆ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో మాళవికా మోహనన్‌ కోరికను ధనుష్ వెంటనే తీర్చడం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైన మాళవిక ప్రస్తుతం విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న 'మాస్టర్' సినిమాలో నటిస్తోంది.