అమ్మమ్మే కాని...

అమ్మమ్మే కాని...

నాగరాజు రాజా, శేఖర్‌ గౌడ్‌లు మలక్‌ పేట పోలీస్‌ కానిస్టేబుళ్ళు.
విధి నిర్వహణలో ఉండగా ఓ ముసలి అవ్వ ఓ నాలుగు నెలల చిన్ని పాపను తీసుకెళుతోంది. మాములు పరిస్థితుల్లో పట్టించుకునేవారు కాదేమోగాని.. ఆమె వాలకం చూస్తుంటే తాగి ఉన్నట్లు  వీరికి అనుమానం వచ్చింది. వెంటనే పాప తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆమెను, పాపను చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. వెంటనే పాలు తెచ్చి పట్టారు స్టేషన్‌లోని పోలీసులు.  ఎస్‌ శ్రీ గోవర్ధన్‌ రెడ్డి, ఆయన బృందం పాపా ఆచూకి కోసం దర్యాప్తు ప్రారంభించారు.దాదాపు రెండు గంటల దర్యాప్తు తరవాత ఆమె పాప ఆచూకి లభించింది పోలీసులకు. అప్పటికే పాప కన్పించకపోవడంతో హైరానా పడుతున్న పాప తలిదండ్రులు వెంటనే  పోలీస్ స్టేషన్‌ చేరుకున్నారు. పాపను హత్తుకు ఆ తల్లి మురిసిపోయింది. ఇంతకీ ఈ స్టోరీలో ట్విస్ట్ ఏమటంటే... ఆ బుల్లి బుజ్జాయిని ఎత్తుకుపోతూ పట్టుబడ్డ ఆమె ఎవరో కాదు. ఆ పాప నానమ్మే. ఈ  ఎపిసోడ్‌లో  ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... తన మనవరాలిని అమ్మేయడానికి ఆమె ప్రయత్నించడం.