మహేష్ బాబు సెటిల్ చేసేశాడు..!!

మహేష్ బాబు సెటిల్ చేసేశాడు..!!

మహేష్ నటించిన 24 సినిమాల్లో విజయాలు పరాజయాలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి.  మహేష్ కెరీర్లో భారీ పరాజయాలుగా బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలను చెప్పుకోవచ్చు.  ఈ రెండు సినిమాలు మహేష్ కు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి.  ఫ్యాన్స్ సైతం తీవ్రస్థాయిలో నిరాశ చెందిన సంగతి తెలిసిందే.  కాగా, బ్రహ్మోత్సవం సినిమా పరాజయం తరువాత పీవీపీ మహేష్.. వంశి పైడిపల్లితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు.  బ్రహ్మోత్సవం పరాజయం తరువాత పీవీపీతో సినిమా చేయాలన్నది ఒప్పందం.  అదీ వంశి పైడిపల్లి దర్శకత్వంలో.  అయితే, భరత్ అనే నేను సినిమా కంటే ముందే దిల్ రాజు, సి అశ్వినీదత్ ల నిర్మాణంలో వంశి తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.  

దీంతో పీవీపీకి కోపం వచ్చింది.  మహేష్ బాబు, వంశి పైడిపల్లిపై కేసు వేసేందుకు పివిపి సిద్దమయ్యాడు.  పివిపి పెద్ద ప్రొడక్షన్ సంస్థ కావడంతో.. గొడవలు ఎందుకులే అని చెప్పి మహేష్ బాబు పివిపికి కొంత మొత్తంలో ముట్టజెప్పి గొడవను సద్దుమణినిగేలా చేశారని మహేష్ సన్నిహితులు అంటున్నారు.  ఏదైతేనేం ఈ గొడవ కోర్టు వరకు వెళ్లకుండానే సెటిల్ అయింది.  దీంతో మహేష్.. వంశి.. దిల్ రాజు సినిమాకు లైన్ క్లియర్ అయింది.