మేకప్‌మెన్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్‌

మేకప్‌మెన్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్‌

ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తనం మహేష్ బాబు నైజం. టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటాడు మహేష్. తాజాగా మహేష్ తన మేకప్ మెన్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. పట్టాభి అనే మేకప్ మెన్ ఎప్పటి నుండో మహేష్‌కి పర్సనల్ మేకప్ మెన్‌గా పని చేస్తుండగా, ఆయన బర్త్‌డేని గుర్తు పెట్టుకొని విష్ చేయడంతో ఫ్యాన్స్ మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

"హ్యాపీ బర్త్‌డే పట్టాభి. షూట్ మొదలైనప్పటి నుండి లాస్ట్ టచ్ అప్ వరకు నాతో ఉండే పట్టాభి ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను " అని మహేష్ అతనితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ విషెస్ అందించారు. ప్రతి ఒక్కరిని గౌరవించి , తన దగ్గర పని చేసేవారికి  మర్యాద ఇచ్చే మహేష్ పై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.