అనీల్ రావిపూడి నో మహేష్ ..!

అనీల్ రావిపూడి నో మహేష్ ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ సినిమాలో మహేష్ బాబును మాస్ గా చూపించడంలో అనీల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.  సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని దక్కించుకుంది. సినిమాకి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది ఈ సినిమా.ఈ సినిమాలో మహేష్ మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా తర్వాత అనీల్  రావిపూడి  ఎఫ్ 3 సినిమానుతెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మహేష్ బాబు కూడా నటిస్తున్నాడని  గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా లో మహేష్  నటించడం లేదని తెలుస్తుంది. ఇటీవల మహేష్ కు అనీల్ స్టోరీ చెప్పాడని అయినా మహేష్ అనీల్ తో సినిమా చేయడానికి సిద్ధంగా లేడని  తెలుస్తుంది. మహేష్ ప్లేస్ లో   రవితేజను ఎంపిక చేశారట .. ఇక  ప్రస్తుతం మహేష్ పరుశురాం తో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఆ తర్వాత మహేష్ సుకుమార్ తో సినిమాచేయనున్నాడు ,ఆతరవాత త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ , పూరీజగన్నాద్ సినిమాలు చేయనున్నాడు.