సూపర్ స్టార్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడేనట..!

సూపర్ స్టార్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడేనట..!

'సరిలేరు నీకెవ్వరు' మూవీతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం విరామం తీసుకుంటున్నాడు. కరోనా కారణంగా అని సినిమా షూటింగ్లు వాయిదా పడ్డాడం తో తన తరువాత సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు సూపర్ స్టార్. అయితే మహేష్ నెక్స్ట్ సినిమా మొదట వంశీ పైడిపల్లి తో అని వార్తలు వచ్చిన తరువాత గీత గోవిందం దర్శకుడు పరుశురాం తోనే ఫిక్స్ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేది అప్పుడే అని సమాచారం. వచ్చే నెల 31 న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అదే రోజు అధికారిక ప్రకటన వస్తుంది అని తెలుస్తుంది. ఎందుకంటే... తన తండ్రిపుట్టిన రోజునాడు తన సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం మహేష్ కు అలవాటు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే... ఈ సినిమాలో విలన్ గా కనిపించేది కన్నడ హీరో ఉపేంద్ర అని వార్తలు వస్తున్నాయి. చూడలి మరి ఏం జరుగుతుంది అనేది.