మహేష్ ఓ పాదరసం: హరీష్ శంకర్

మహేష్ ఓ పాదరసం: హరీష్ శంకర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాదరసం అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. సుధీర్ బాబు, అదితి రావు హైదరి తాజాగా నటించిన చిత్రం 'సమ్మోహనం'.  మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టిన చిత్రబృందం ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ ఈవెంటుకి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా వచ్చారు. మహేష్ బాబుతో పాటు చాల మంది టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ... మహేష్ బాబు గారి గురించి మాట్లాడటానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఆయన గురించి ఏమనుకుంటున్నారో శివ గారు రెండు హిట్ సినిమాలు శ్రీమంతుడు, భరత్ అను నేనులో చూపించారు. ఇక వంశీ ఏమనుకుంటున్నాడో త్వరలో మీకు చూపించబోతున్నాడు. నాకు ఇంకా ఆ అవకాశం రాలేదు కాబట్టి నేను మహేష్ గురించి మాట్లాడాలనుకుంటున్నానని హరీష్ శంకర్ అన్నారు. మీలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే.. మీరు ఏ దర్శకుడిని అయినా సరే అడాప్ట్ చేసుకుంటారు.. అదే నాకు నాకు చాలా నచ్చిందని తెలిపారు. పోకిరి, బిజినెస్ మాన్ లలో పూరిగారి టైమింగ్.. సీతమ్మ వాకిట్లో సినిమాలో శ్రీకాంత్ గారి స్లాంగ్.. శివగారి సినిమాలో సెటిల్ పెర్ఫామెన్స్ ఇలాగ ఏ దర్శకుడితో సినిమాతో చేస్తే ఆ దర్శకుడిని అడాప్ట్ చేసుకుంటారు. మెర్క్యూరీ ఏ విజిల్ లో పోస్తే ఆ విజిల్ పరిమాణాన్ని తీసుకుంటది.. మీరు అలానే పాదరసంలాంటోళ్ళు అని అన్నారు. ఎదో ఒక రోజు హరీష్ శంకర్ బాడీ లాంగ్వేజ్ లో కూడా మిమ్మల్ని చూడాలనుకుంటాని తన కోరికను తెలిపాడు హరీష్ శంకర్.