ఈ సారి మహేష్ ఫ్యాన్స్ వంతు ..

ఈ సారి మహేష్ ఫ్యాన్స్ వంతు ..

పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్‌ కూడా అయ్యాడు . మలయాళ చిత్రం `కప్పెళ`ను పొగుడుతూ ఈ మధ్య తరుణ్ భాస్కర్ చేసిన పోస్ట్ ఒకటి వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే . కాగా గతంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు తరుణ్ ఓ అవార్డు విషయమై ‘జనతా గ్యారేజ్’ గురించి చేసిన వ్యాఖ్యలతో అతను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అప్పట్లో తారక్ ఫ్యాన్స్ తరుణ్‌‌ను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. తాజాగా మలయాళ చిత్రం `కప్పెళ`ను పొగుడుతూ ... పిచ్చోడిలా అరవడం.. స్మార్ట్ గా డైలాగ్ చెప్పడం.. స్లో మోషన్ ఫైట్లు.. క్లైమాక్స్ లో మెసేజ్ లు ఇచ్చే హీరోలు ఉండరు. చివరి 10 నిమిషాల్లో రైతుల గురించో.. సైనికుల గురించో.. ఇండియా గురించో సందేశాలు ఉండవు. కానీ దీన్ని కూడా ఆ ఊరిలో సినిమా అంటారు మరి`` అంటూ తరుణ్ పోస్ట్ పెట్టారు.అయితే తరుణ్ విమర్శించిన వాటిల్లో మహేష్ నటించిన మహర్షి.. సరిలేరు నీకెవ్వరు సినిమాల కాన్సెప్ట్లు  ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ నుండి తరుణ్ పై విమర్శలు వస్తున్నాయి.