మ‌హేష్ 26 క‌థ ఎవ‌రిదో తెలుసా?

మ‌హేష్ 26 క‌థ ఎవ‌రిదో తెలుసా?

ఎంచుకునే క‌థాంశం, ఎత్తుగ‌డ‌లో సంథింగ్ ఏదైనా ఉండాలి. అలా ఉన్న‌ప్పుడే ఆ సినిమా న‌డ‌క‌, న‌డ‌త‌, తీరుతెన్నులు ప్రేక్ష‌కుల్ని మెప్పించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ పాయింట్‌లో సుకుమార్ గ్రాండ్ స‌క్సెస్ అయ్యారు. అత‌డు తెర‌కెక్కించిన ప్ర‌తి సినిమా ఏదో ఒక వైవిధ్య‌మైన పాయింట్‌తో కొత్త‌ద‌నంతో క‌నిపిస్తుంది. ఆర్య‌, 1నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్థ‌లం .. ఇలా ప్ర‌తి సినిమాని విల‌క్ష‌ణ‌మైన క‌థాంశంతోనే తెర‌కెక్కించారు సుకుమార్. ప్ర‌స్తుతం మ‌హేష్ 26 కోసం క‌థ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా త‌న‌దైన శైలిలో వైవిధ్యంగా ఉండేందుకు క‌థ‌లో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. 

త‌న అసోసియేట్ ఒక‌రు వినిపించిన లైన్ ఎంతో బాగా న‌చ్చిందిట‌. ఆ లైన్‌ను ఇప్పుడు పూర్తి స్థాయి స్క్రిప్టుగా త‌యారు చేస్తున్నారు. ఈ ఏడాది చివ‌రిలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి... 2019లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. సుకుమార్ స్వ‌త‌హాగానే స్క్రిప్టు వ‌ర్క్ కోసం ఎక్కువ స‌మ‌యం తీసుకుంటారు. ప్ర‌తిదీ ప‌క్కాగా వ‌చ్చాకే సెట్స్‌కెళ్లే అల‌వాటుంది. ఆర్నెళ్ల పాటు కేవ‌లం స్క్రిప్ట్ కోస‌మే కేటాయిస్తారన్న సంగ‌తి తెలిసిందే.