సరికొత్త రికార్డ్ సృష్టించిన సూపర్ స్టార్

సరికొత్త రికార్డ్ సృష్టించిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది  సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించిన మహేష్ బాబు తన తర్వాతి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో చేస్తున్నారు . సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న మహేష్ తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ట్విట్టర్ లో మహేష్ బాబు ను ఏకంగా కోటిమంది ఫాలో అవుతున్నారు . సౌత్ ఇండియాలో ఏ స్టార్‌కి ట్విట్టర్‌లో కోటి ఫాలోవర్స్ లేకపోవడంతో, ఈ ఘనత సాధించిన ఏకైన సౌత్ ఇండియా స్టార్ మహేష్ కావడం విశేషం. మహేష్ తన ట్విట్టర్‌లో సినిమా అప్‌డేట్స్‌తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా తరచు ఇస్తుంటారు.