తండ్రి పుట్టినరోజు నాడు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చిన మహేష్...

తండ్రి పుట్టినరోజు నాడు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చిన మహేష్...

సూపర్ స్టార్ మహేష్ బాబు  సరిలేరు నీకెవ్వరు సినిమా తరవాత పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఫిలిం నగర్ లో ఒక వార్త గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసారంటూ వార్తలు వచ్చాయి. అయితే మహేష్ తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న అంటే ఈ రోజు ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తారు అని తెలిపారు. అయితే చెప్పినట్లుగానే తన తండ్రి పుట్టినరోజు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు మహేష్ బాబు. తన ట్విట్టర్లో తన తర్వాతి సినిమా పోస్టర్ విడుదల చేసాడు. అయితే అంతక ముందు వచ్చినట్లే 'సర్కారు వారి పాట' అనే టైటిల్ తో విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు తన మేడ మీద ''రూపాయి'' ముద్ర వేసుకున్నాడు. అలాగే చెవికి ఫోగు తో మహేష్ లుక్ అదిరింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి. అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.