ప్రపంచంలోనే అతి'పెద్ద' నాయకుడు

ప్రపంచంలోనే అతి'పెద్ద' నాయకుడు

ప్రపంచంలో కొన్ని దేశాల్లో అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులుగా యువత ఎదుగుతుండగా మలేసియాలో మాత్రం ఓ వృద్ధ నేత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 92 ఏళ్ల మహతిర్‌ మహ్మద్‌ ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలో ఎన్నికైన ప్రభుత్వాధినేతల్లో అత్యధిక వయస్కుడిగా మహతిర్‌ రికార్డు నెలకొల్పారు. పార్లమెంట్‌లో మొత్తం 222  సీట్లకుగాను ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు అవసరం కాగా.. మహతిర్ నాయకత్వంలోని 'పకటన్ హరపన్' కూటమి 115 సీట్లలో గెలుపొందింది. ప్రస్తుత ప్రధాని నజీబ్ రజాక్ నేతృత్వంలోని బీఎన్ కూటమికి 79 సీట్లు దక్కించుకుంది. గతంలో బీఎన్‌ కూటమిలో ఉన్న మహితిర్‌..1981 నుంచి 2003 వరకు 22 ఏళ్లపాటు ప్రధానిగా చేశారు. 2016లో బీఎన్ కూటమి నుంచి బయటకొచ్చి.. పకటన్ హరపన్‌లో చేరారు. వాస్తవానికి రాజకీయాల నుంచి రిటైర్‌ అయిన మహతిర్‌.. తన మాజీ శిష్యుడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని నజీబ్ రజాక్‌పై ఈసారి పోటీ చేసి.. విజయం సాధించారు.