క‌రోనా క‌ల్లోలం.. మ‌న మూడు రాష్ట్రాలు చైనా రికార్డును బ్రేక్ చేశాయి..!

క‌రోనా క‌ల్లోలం.. మ‌న మూడు రాష్ట్రాలు చైనా రికార్డును బ్రేక్ చేశాయి..!

క‌రోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో న‌మోదైన పాజిటివ్ కేసుల‌ను, మృతుల సంఖ్య‌ను భార‌త్ ఎప్పుడో వెన‌క్కి నెట్టింది.. ఇప్పుడు దాదాపు 6 ల‌క్ష‌ల క‌రోనా కేసుల‌తో ప్ర‌పంచంలోనే నాల్గోస్థానానికి చేరింది.. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. చైనాలో దేశ‌వ్యాప్తంగా న‌మోదైన కేసుల సంఖ్య‌ను భార‌త్‌లోని రెండు రాష్ట్రాలు ఇప్ప‌టికే క్రాస్ చేయ‌గా.. తాజాగా మ‌రో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది. 

చైనాలో ఇప్పటి వరకు మొత్తం 83,531 కరోనా కేసులు న‌మోదు అయ్యాయి.. మహారాష్ట్రలో తాజాగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 5,257 కరోనా కేసులు న‌మోదు కావ‌డంతో.. మొత్తం కేసులు 1,69,883కు చేరి దేశంలోనే మొద‌టిస్థానంలో కొన‌సాగుతోంది.. ఇక‌, 7,610 మంది మరణించారు. మ‌రోవై, తమిళనాడులో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 86,224కు చేరగా.. 1,141 మంది చనిపోయారు.. ఇది రెండోస్థానంలో ఉంది..  తాజాగా, ఢిల్లీలో గత 24 గంటల్లో 2,084 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,161కు పెరిగి ప్ర‌స్తుతం మూడోస్థానానికి చేరుకుంది.. దేశ‌రాజ‌ధానిలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,680 మంది మరణించారు. ఇలా మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ఢిల్లీ.. మూడు రాష్ట్రాలు.. చైనాలో న‌మోదైన కేసుల రికార్డును బ్రేక్ చేశాయి.