`మ‌హాన‌టి` శాటిలైట్ కాస్ట్‌లీ గురూ

`మ‌హాన‌టి` శాటిలైట్ కాస్ట్‌లీ గురూ

సావిత్రి జీవిత‌క‌థ వెండితెర‌పై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. `మ‌హాన‌టి` ప్ర‌పంచ‌వ్యాప్తంగా తొలి వీకెండ్ (3డేస్‌) 16కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కేవ‌లం అమెరికా నుంచే 7కోట్లు వ‌సూలైంది. ఈ స్థాయి విజ‌యం వైజ‌యంతి సంస్థ సైతం ముందే ఊహించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఈ విజ‌యానికి త‌గ్గ‌ట్టే శాటిలైట్ ప‌రంగానూ అద్భుత‌మైన‌ బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది.

`మ‌హాన‌టి` శాటిలైట్ హ‌క్కులకు భారీ ధ‌ర ప‌లికింద‌ని తెలుస్తోంది. ప్ర‌ఖ్యాత ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్ 11కోట్లు చెల్లించి శాటిలైట్ హ‌క్కులు ఛేజిక్కించుకుందట‌. క‌ళ్లు చెదిరే ధ‌ర ఇది.. స్టార్ హీరోల సినిమాల‌కు ధీటుగా నాయికా ప్ర‌ధాన సినిమా శాటిలైట్ అమ్మ‌కంపై ప్ర‌స్తుతం ఫిలింవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అనుష్క `భాగ‌మ‌తి` త‌ర‌హాలోనే `మ‌హాన‌టి`కి మంచి పేరుతో పాటు ఆదాయం వ‌చ్చింది. మార్కెట్ ప‌రంగా అన్నీ క‌లిసొచ్చాయి. అనుష్క త‌ర‌వాత కీర్తి సురేష్ ఆ స్థాయిని అందుకుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.