'మహానటి' ఎంత రాబట్టిందంటే..!

'మహానటి' ఎంత రాబట్టిందంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో మహానటి ఫీవర్ మాములుగా లేదు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. తెలుగుతో పాటు లేటెస్ట్ గా తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. శుక్రవారానికి మొత్తం 8 లక్షల 54 వేల డాలర్ల వసూళ్లు రాబట్టింది. అంటే అక్షరాల 5 కోట్ల 75 లక్షలన్నమాట. 
అమెరికాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 'మహానటి' కూడా చేరడం విశేషం. రంగస్థలం, భరత్ అనే నేను, అజ్ఞాతవాసి, భాగమతి, తొలిప్రేమ వంటి సినిమాల తరువాతి స్థానంలో 'మహానటి' నిలిచింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రతో పాటు సినిమాలో ఇతర పాత్రలు పోషించిన వారికి కూడా మంచి పేరు దక్కింది.