పాప్ సింగర్ కు కరోనా ..షాక్ లో ఫ్యాన్స్

పాప్ సింగర్ కు కరోనా ..షాక్ లో ఫ్యాన్స్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా  దెబ్బకు దేశ దేశాలు గడగడలాడుతున్నాయి. చిన్న పెద్ద ,పేద ధనిక , సామాన్యులు సెలబ్రెటీలు అనే బేధం లేకుండా అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది ఈ మహమ్మారి. ఇప్ప్పటికే అలువురు సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అమెరికన్ పాప్ సింగర్ మడోన్నాకు కరోనా వచ్చిందని ఆమె కండిషన్ చాలా సీరియస్ గా ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి.  దాంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది మడోన్నా . తాను ఇటీవల ఓ టూర్ కు వెళ్లినట్టు ఆ సమయంలో తనకు కరోనా సోకిందని చెప్పింది మడోన్నా.  దీనిపై 'క్వారంటైన్ డైరీ' పేరుతో తన ఆరోగ్యానికి సంబంధించిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.క్వారంటైన్‌లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కోలుకున్నాను. ఇటీవల చేయించిన పరీక్షలలో నా శరీరంలో యాంటీ బాడీస్ ఉన్నట్టు గుర్తించాను. కరోనాని ఎదిరించే యాంటీబాడీస్ అధికంగా ఉండడంతో తొందరగా కోలురకున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది అని మడోన్నా పేర్కొంది.