నెటిజన్ కు చుక్కలు చూపించిన మంచు లక్ష్మి..!

నెటిజన్ కు చుక్కలు చూపించిన మంచు లక్ష్మి..!

కరోనా లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్ లు కూడా ఆపివేయడంతో సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు వినోదం పంచుతున్నారు. చిరంజీవి లాంటి స్టార్ లు సైతం ఇప్ప్పుడు సోషల్ మీడియా లోనే కాలం గడుపుతూ ఫ్యాన్స్ కి మరింత  దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యం లోనే ట్విట్టర్ లో మంచు లక్ష్మి తనకు కామెంట్ పెట్టిన ఓ యువకుడికి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఆమె పెట్టిన ట్వీట్ కు ఓ నెటిజన్ "అక్కా మీ నెట్ ఫ్లిక్స్ ఐడీ ని షేర్ చేయండి" అంటూ కామెంట్ పెట్టగా లక్ష్మి అతడికి దిమ్మ తిరిగేలా  "నీ బ్యాంకు అకౌంట్ డీటేల్స్ చెప్పు తమ్ముడు ఆన్లైన్ షాపింగ్ చేస్కుంటా" అని కామెంట్ చేసింది. లక్ష్మి చేసిన కామెంట్ కి అందరూ మంచి సమాధానం ఇచ్చారు అంటూ ప్రశంసించారు.