'ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేస్తాం...'

'ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేస్తాం...'

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం అన్నారు. ఈ రోజు ఆయన రామగుండం రణభేరిలో మాట్లాడుతూ... వేలాది మంది ఉద్యమకారుల ఆత్మబలిదానాల ఫలితమే తెలంగాణ అని పేర్కొన్నారు. అయితే తెలంగాణ వచ్చాక అమరుల త్యాగాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు. సింగరేణి కార్మికుల పేరుమార్పిడిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. వ్యవసాయం చేసుకునే కౌలుదారులను ప్రభుత్వం పట్టిచుకోవడం లేదని కోదండరాం విమర్శించారు.

రాజకీయం సొంత స్వార్ధం కోసం కాకుండా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేస్తే అందరం సంతోషిస్తామని కోదండరాం పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై రేపటి నుండే పోరాటాలు మెదలుపెడతామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా రామగుండం ప్రజల సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల కంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ లాభమని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లని పెంచి పోషిస్తుందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు.. సరైన పనికి సరైన వేతనం చెల్లించాలని కోదండరాం డిమాండ్ చేశారు.