34 ఏళ్లకు బయటపడ్డ లారీ 

34 ఏళ్లకు బయటపడ్డ లారీ 

సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా కరీంనగర్ లోని ఇరుకుల్ల వాగులో ఓ లారీ గల్లంతైంది. ఈ నాటికి ఆ లారీ తాలూకూ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడి భాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 

1984లో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్‌ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన లారీలో డ్రైవర్‌ సలీం, కటికె శంకర్‌ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరద నీటిలో కొట్టుకుపోయింది. అప్పటి ఆ లారీ తాలూకూ ఆనవాళ్లు ఇసుక తవ్వకాల కారణంగా వెలుగులోకి వచ్చింది.