ఆటోను లారీ ఢీ... ఇద్దరు మృతి 

ఆటోను లారీ ఢీ... ఇద్దరు మృతి 

కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ఆటోను.. లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈరోజు ఉదయం సంభవించింన ఈ ఘోర రోడ్డుప్రమాదం నందిగామ శివారు అన్నాసాగరం వద్ద చోటుచేసుకుంది. రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటోను ఎదురుగా లారీ ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. 
ఈ ప్రమాదం మృతి చెందినవారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. చందర్లపాడు మండలం కోపూరులో జరుగుతున్న దశదిన కర్మ కార్యక్రమానికి మాంసం, ఇతర వస్తువులు ఆటోలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆసుపత్రికి తరలించారు. నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.