దూసుకొస్తున్న ప్రమాదం..తెలంగాణకి ముప్పు తప్పదా...?

దూసుకొస్తున్న ప్రమాదం..తెలంగాణకి ముప్పు తప్పదా...?

ఉత్తరాదిలో అల్లాడిస్తున్న మిడతలు, తెలంగాణ వైపు దూసుకోస్తున్నాయి. మహరాష్ట్రలోని విదర్భ నుంచి ఎప్పుడైనా దండయాత్ర చేసే అవకాశముండంతో సరిహద్దు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్  జిల్లాల కలెక్టర్లు రెడీ అవుతున్నారు.


అసలే కరోనా దెబ్బతో దేశం అల్లాడిపోతుంటే మహరాష్ట్ర మీదుగా తెలంగాణ గడ్డమీదకు ఈ మిడతల దండు దూసుకొస్తుంది..పాకిస్తాన్ సరిహద్దు నుంచి రాజస్తాన్ మీదుగా ప్రవేశించిన మిడతలు మహరాష్ట్ర లోని విదర్బలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవి విండ్ పోజిషన్ ను బట్టి ఎటైతే అటే పరుగులు పెడుతాయి.దండు కట్టి మరీ పంటలపై దండయాత్ర చేస్తాయి. పచ్చని చెట్టు కనిపిస్తే చాలు చెట్ల బెరడును సైతం వదిలిపెట్టవు..పంటలపై వాలితే చాలు పంట మొత్తం పిప్పికావాల్సిందే.

మిడతల దండు అర కిలోమీటర్ వెడల్పు..ఆరు కిలోమీటర్ల పొడవులో దండు కట్టి ప్రయాణం చేస్తాయని అధికారులు చెబుతున్నారు...ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మిడతలు విజృంభిస్తాయి. అయితే ఇవి గంటకు ఐదు నుండి 130 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు పయనిస్తాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిడతలపై దండయాత్రకు రెడీ అయ్యింది. ఆదిలాబాద్ ,నిర్మల్ ,ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు నిజామాబాద్ జిల్లాలపై మిడత ప్రభావం దండిగా ఉండటంతో, ఆయా జిల్లాల కలెక్టర్ లను అప్రమత్తం చేసింది ప్రభుత్వం.