సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం వరకు పూర్తిగా కర్ఫ్యూ

సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం వరకు పూర్తిగా కర్ఫ్యూ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నుంచి చాలా వరకు సడలింపులు లభించాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో అయితే, ఏ మాత్రం భౌతికదూరం పాటించకుండా.. మాస్క్ ధరించకుండా.. కరోనా కష్టకాలంలోనూ సాధారాన రోజుల్లోలాగే తిరిగేస్తున్నారు.. అయితే, కర్ణాటక ప్రభుత్వం జనతా కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి రేపు ఆదివారం పూర్తిగా కర్ఫ్యూ కొనసాగనుండగా.. తిరిగి సోమవారం ఉదయం 7 గంటల నుంచి లాక్‌డౌన్ సడలింపులో అమల్లోకి వస్తాయి.. బెంగళూరులో వచ్చే రెండు ఆదివారాలు పూర్తిగా కర్ఫ్యూ రోజులు అవుతాయని పోలీసు కమిషనర్ భాస్కర్ రావు స్పష్టం చేశారు. ప్రతీ శనివారం సాయంత్రం 7 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు నగరం పూర్తి లాక్‌డౌన్ అవుతుందని, వివాహాలు మరియు ఇతర వేడుకలు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ఈ కర్ఫ్యూ సమయంలో విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇక, మే 31 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించగా.. కర్ణాటక నుండి అంతర్రాష్ట్ర ప్రయాణానికి ప్రభుత్వం అనుమతించింది.. కర్ణాటక నుండి బయటకు వెళ్ళడానికి ఇంటర్ స్టేట్ పాస్ అవసరం లేదు. లాక్‌డైన్ కారణంగా వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు ఇతర వ్యక్తులు వివిధ ప్రదేశాలలో చిక్కుకున్న వారికి మాత్రం ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలిపారు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు.