వైరల్: లాక్ డౌన్ లో ఖడ్గమృగం పహారా...పరుగులు తీస్తున్న జనం... 

వైరల్: లాక్ డౌన్ లో ఖడ్గమృగం పహారా...పరుగులు తీస్తున్న జనం... 

లాక్ డౌన్ ఈ మాట ఇప్పడు ప్రపంచం మొత్తం వినిపిస్తోంది.  ఎక్కడో చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరించింది.  ఈ వైరస్ క్రమంగా బలపడి మహమ్మారిగా మారింది.  ప్రపంచంలోని 90 దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది.  22 దేశాలు సంపూర్ణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నది.  భారతదేశానికి అనుకోని ఉన్న నేపాల్ దేశంలోనూ కరోనా వ్యాపిస్తున్నది.  నేపాల్ దేశంలో ఇప్పటి వరకు కేవలం 9 కేసులు మాత్రమే నమోదయ్యాయి.  

హిమాలయాలకు అనుకోని ఉన్న ప్రదేశంలో నేపాల్ దేశం ఉన్నది కాబట్టి మరింత అప్రమత్తం అయ్యింది.  ముందుగానే మేలుకొని లాక్ డౌన్ విధించింది.  దీంతో నేపాల్ రాజధాని కాట్మండు నగరం కూడా బోసిపోయింది.  ఎవరూ బయటకు రావడం లేదు.  జనసంచారం లేకపోవడంతో వన్యమృగాలు రోడ్లమీదకు వస్తున్నాయి.  హాయిగా సంచరిస్తున్నాయి.  నగరం వీధులన్నీ బోసిపోవడంతో ఓ ఖడ్గమృగం వీధుల్లోకి వచ్చింది.  కొద్దికొద్దిగా బయట తిరుగుతున్న జనం ఖడ్గమృగాన్ని చూసి పరుగులు తీశారు.  లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎన్ని చెప్పినా వినని జనాలు, ఇలా జంతువులను చూసి మాత్రం పారిపోతున్నారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.